Sunday, September 8, 2024

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్‌కు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

శివమొగ్గ : ఫిబ్రవరి 22న తనను విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి ) సమన్లు జారీ చేసిందని, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ బుధవారం వెల్లడించారు. తన కుమార్తెకు సిబిఐ నోటీస్ జారీ చేసిందని చెప్పారు. వచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున“ ప్రజాధ్వనియాత్ర” సాగించడానికి శివకుమార్ సంసిద్ధమవుతున్నారు. ఇడి లేదా సిబిఐ ప్రతిపక్షాల పైనే దర్యాప్తులు చేపడతాయి తప్ప పాలక వర్గాలను ఏమీ అనవని విమర్శించారు.

ప్రతిరోజూ నోటీసులు రావడం పరిపాటి అయిందని, నిన్న తన కుమార్తెకు సిబిఐ నుంచి నోటీస్ వచ్చిందని, ఫీజు చెల్లింపు, పరీక్ష ఉత్తీర్ణతలకు సంబంధించి విచారణకు నోటీసులు స్కూలుకే వచ్చాయన్నారు. కాలేజీ ఫీజు చెల్లింపు గురించి ప్రశ్నిస్తే తాను ఏం చెప్పగలనని అన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు తానేం ఇచ్చానో ఇడికి చెప్పి తిరిగి వచ్చానని, మళ్లీ ఇప్పుడు ఫిబ్రవరి 22 న హాజరు కావాలంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజాధ్వని కొనసాగించాలా లేక ఇడి ఎదుట హాజరు కావాలా అని ప్రశ్నించారు. పాలక వర్గాల నేతలు కోట్లు కూడబెడుతున్నా వారిని ఇడి, సిబిఐ ఏం అడగరని, విపక్షాలపైనే దర్యాప్తులని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News