Wednesday, January 22, 2025

వివక్షపై నిరసన గళం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పన్నుల నిధుల పంపిణీ, గ్రాంట్ల విషయంలో కేంద్రం కర్నాటకకు ‘అన్యాయం’ చే స్తున్నదని ఆరోపిస్తూ ఢిల్లీలో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన బల ప్రదర్శన కాదని, రాష్ట్ర ప్రజ ల గొంతుక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ బుధవారం స్పష్టం చేశారు. తమ పార్టీ దీనిపై పోరు సాగి స్తుం దని, పరిస్థితులు ఇదే విధంగా కొనసాగిన పక్షం లో, కేంద్ర ప్రభుత్వం తమ ఇబ్బందులను ప రిష్క రించని పక్షంలో కర్నాటక వీధులలో నిరసన ప్ర దర్శనలు లేవదీస్తామని ఆయన హెచ్చరించారు. 15వ ఆర్థిక సంఘం కింద ఐదు సంవత్స రాలలో లక్షా 87 వేల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రానికి వాటిల్లిన నష్టాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయా లని కోరుతూ సిద్ధరామయ్య నేతృత్వం లోని ప్రభు త్వ మంత్రులతో సహా కర్నాటక కాం గ్రెస్ శాసన సభ్యులు, ఎంపిలు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ‘అది బల పరీక్ష కాదు. కర్నాటక ప్రజలు తమ బ లం ప్రదర్శించాలని కోరుకోవడం లేదని మీకు తె లుసు. అది అన్యాయం జరిగిన కర్నాటక గొం తుక.

ఏడు కోట్ల  మంది రోజూ పన్ను కడుతున్నారు. మాకు 13 శాతం మాత్రమే వస్తోంది. మా వాటా కోరుతున్నాం’ అని శివకుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిరసన బల పరీక్షా అన్న ప్రశ్నకు ఆయన అలా సమాధానం ఇచ్చారు. దేశ రాజధానిలో ప్రదర్శనకు సంబంధించిన వార్తా సంస్థ వీడియోలను శివకుమార్ ప్రస్తావిస్తూ, ‘జిఎస్‌టి మాత్రమే కాకుండా ప్రతి విషయంలోను రాష్ట్ర వాటా సరైన విధంగా లేదు’ అని చెప్పారు. ఎగువ భద్రతో సహా జాతీయ స్థాయిలో ప్రకటించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు అందడం లేదని శివకుమార్ ఆరోపిస్తూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యురాలు కూడా అయిన నిర్మలా సీతారామన్ ఇందుకు సమాధానం ఇవ్వాలని కోరారు. ‘ఏమీ ఇవ్వడం లేదు& (జల వనరుల అభివృద్ధికి, బెంగళూరు బాహ్య వలయ రహదారికి) రూ. 6000 కోట్లు ఇవ్వవలసి ఉంటుందని ఆర్థిక సంఘం తెలిపింది. దానిని కూడా ఇవ్వలేదు’ అని ఆయన పేర్కొంటూ, నిర్మలా సీతారామన్ ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు.

కర్నాటక ప్రభుత్వం హామీలపై డబ్బు వెచ్చిస్తోందని, ఇప్పుడు ప్రభుత్వం నిర్వహణకు నిధుల కోసం కటకటలాడుతోందని ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రకటన గురించి ప్రశ్నించగా, ‘హామీలు, ఇది భిన్నమైనవి. వారు (కేంద్రం) మా డబ్బు ఇవ్వనివ్వండి. కర్నాటక ప్రజల ఆకాంక్షల ప్రకారం మేము కోరుకున్నదల్లా చేస్తాం’ అని శివకుమార్ సమాధానం ఇచ్చారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగిన పక్షంలో తదుపరి చర్య ఏమిటి అన్న ప్రశ్నకు శివకుమార్ సమాధానం ఇస్తూ, ‘మేము పోరాడతాం. కర్నాటక వీధులలో ప్రదర్శన నిర్వహిస్తాం’ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News