Monday, January 20, 2025

ధ్రువనారాయణ మృతిపట్ల రాహుల్ గాంధీ సంతాపం….

- Advertisement -
- Advertisement -

కెపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్రువనారాయణ గుండెపోటుతో మృతి

బెంగళూరు: కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధ్రువనారాయణ(62) శనివారం ఉదయం మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. చామరాజనగర్(ఎస్‌సి) నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా 2009 నుంచి 2014 వరకు ఉన్న ధ్రువరనారాయణ 2019 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీనివాస ప్రసాద్ చేతిలో ఓటమి చెందారు. అంతకు ముందు ఆయన 2004లో శాంతెమరహల్లి ఎస్‌సి రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2008లో కొల్లేగల్ ఎస్ రిజర్వ్‌డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన గెలుపొందారు.

కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ తలపెట్టిన కాంగ్రెస్ ప్రజాధ్వని యాత్ర శనవారం రామనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జరగవలసి ఉండగా ధ్రువనారాయణ హఠాన్మరణం కారణంగా రద్దయ్యింది. కాగా..ధ్రువనారాయణ హఠాన్మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి ఎదిగిన ధ్రువనారాయణ సామాజిక న్యాయం కోసం తీవ్రంగా కృషిచేశారని రాహుల్ పేర్కొన్నారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన తెలిపారు.ధ్రువనారాయణ కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News