Friday, November 22, 2024

కర్ణాటకలో కుర్చీలాట!

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో మరొకసారి సిఎం పదవి కోసం కుర్చీలాట మొదలైంది. సిఎం సిద్దరామయ్య వరుస స్కాంలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో కన్నడ రాజకీయం రసకందాయంలోపడింది. ప్రస్తుతం ఇదే అదనుగా సిఎం పోస్టు కోసం కీలక నేతలు తెరవెనక మంత్రంగాలు మొదలుపెట్టారు. ‘మాడా భూములు’, ‘వాల్మీకి కార్పొరేషన్’, ‘రాష్ట్ర వక్ఫ్ బోర్డు’ ఇలా వరుస స్కాంలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సిద్దరామయ్య సిఎం పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సిద్దరామయ్యకు అధిష్టానం అండగా నిలవాలి. కానీ అధిష్టాన ప్రోత్సాహంతో సిఎం పదవి కోసం పోటీ రాజకీయాలు జరుగుతున్నాయి.

ఒక రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఎవరు ఎదిగినా కాంగ్రెస్ అధిష్టానం భరించలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తికాలం ఆత్మవిశ్వాసంతో స్వేచ్ఛగా తమ రాష్ట్రంలో నిర్ణయాలను తీసుకోలేరు. ప్రతి చిన్న నిర్ణయానికి అధిష్టాన నిర్ణయంపై ఆధారపడతారు. అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా వీరవిధేయత ప్రకటించినంత కాలమే వారు పదవిలో కొనసాగుతారు.ఒక రాష్ట్రంలో స్వయంగా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించడంతో అది సంతృప్తి చెందదు. పక్కలో బల్లెంలా మరో షాడో వర్గాన్ని లేదా మరో బలమైన నాయకుణ్ణి షాడో ముఖ్యమంత్రిగా ఆశలు కల్పిస్తుంది. ఈ షాడో వర్గం నిరంతరం ప్రస్తుత ముఖ్యమంత్రి నిర్ణయాలను, వ్యక్తిగత స్వేచ్ఛా నిర్ణయాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం చేరవేస్తూ ఉంటారు. కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారందరికీ ఈ విషయాలు తెలిసినవే. అందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిఎం పోస్టులకు గ్యారెంటీ ఎంతమాత్రం ఉండదని విమర్శకులు అంటూ ఉంటారు.

ఉదాహరణకు అధికారంలోకి వచ్చి కనీసం 15 నెలలు కూడా కాకముందే కర్ణాటకలో మరొకసారి సిఎం పదవి కోసం కుర్చీలాట మొదలైంది. సిఎం సిద్దరామయ్య వరుస స్కాంలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో కన్నడ రాజకీయం రసకందాయంలోపడింది. ప్రస్తుతం ఇదే అదునుగా సిఎం పోస్టు కోసం కీలక నేతలు తెరవెనక మంత్రంగాలు మొదలుపెట్టారు. ‘మాడా భూములు’, ‘వాల్మీకి కార్పొరేషన్’, ‘రాష్ట్ర వక్ఫ్ బోర్డు’ ఇలా వరుస స్కాంలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సిద్దరామయ్య సిఎం పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సిద్దరామయ్యకు అధిష్టానం అండగా నిలవాలి. కానీ అధిష్టాన ప్రోత్సాహంతో సిఎం పదవి కోసం పోటీ రాజకీయాలు జరుగుతున్నాయి. కర్ణాటకలో సిఎం మార్పు త్వరలోనే జరుగునున్నట్లు పరిస్థితులు తెలుపుతున్నాయి. ఇదే అదనగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ తెరవెనక మంత్రంగాన్ని ప్రారంభించినట్లు తెలుస్తున్నది. మంత్రి సతీశ్ జార్కిహోళీ తో సోమవారం రాత్రి 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరూ డికె శివకుమార్ సిఎం అవుతారని అంచనాలు వేశారు.

అయితే అధిష్టానం అనూహ్యంగా సిద్దరామయ్యను తెరమీదకు తెచ్చింది. సిఎం పదవిని కట్టబెట్టింది. దీనిపై డికె వర్గం ఎంఎల్‌ఎలు గుర్రుగా ఉన్నారు. కానీ, మెజారిటీ ఎంఎల్‌ఎలు మద్దతు సిద్దరామయ్యకు ఉండడంతో ఇంతకాలం సిఎం పదవికి ముప్పుకలగలేదు. డికెకు ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చి అధిష్టానం బుజ్జగించింది. ఇప్పుడు సిద్దరామయ్య సిఎం పదవి వదులుకుంటే ఎవరు ఆ రేసులో ఉంటారో అన్నది ప్రస్తుతం చర్చ ముమ్మరంగా జరుగుతున్నది. మల్లికార్జున ఖర్గే లేదా మంత్రి జి పరమేశ్వర్‌కు కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో డికె శివకుమార్ ఉన్నపళంగా సోమవారం రాత్రి జార్కిహోళిని కలిశారు. ఒకవేళ సిఎంగా తనను ప్రతిపాదించి మద్దతు ప్రకటిస్తే కెపిసిసి అధ్యక్ష పదవి వచ్చేలా తాను అధిష్టానాన్ని ఒప్పిస్తానని జార్కిహోళికి డికె ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది. కాగా ఇప్పటికే జార్కి హోళికి 20 మంది ఎంఎల్‌ఎల మద్దతు ఉంది. అందుకే జార్కి హోళి, డికె శివకుమార్‌కు తాను మద్దతు ప్రకటించలేదు. వాల్మీకి (ఎస్‌టి) వర్గానికి చెందిన బలమైన నేతగా అధిష్టానం తనను సిఎంగా ప్రకటిస్తుందన్న ఆశ ఆయనలో బలంగా ఉంది. శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జార్కి హోళి ప్రస్తుతం సిఎం రేసులో ఆశావహులుగా ఉన్నారు. దళిత వర్గ ప్రజలు, వాల్మీకి గురుపీఠ స్వామీజీ ప్రసన్నానంద మాత్రం జార్కిహోళికే తన మద్దతు ప్రకటించారు. వీరిలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో వేచిచూడాలి.

కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాలను ఏదో మిషతో కూల్చివేయాలని బిజెపి కంకణం కట్టుకుంది. గత పదేళ్ళలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను తనకు స్వయంగా బలం లేక పోయినా విపక్ష ఎంఎల్‌ఎలను ప్రలోభపెట్టో, దర్యాప్తు సంస్థలతో భయపెట్టో రెండుగా చీల్చి ఆ ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర బిజెపిది. మరోసారి కర్నాటక కాంగ్రెస్‌పై తన పంజా విసిరింది. ‘ముడా’ స్కాంలో సిద్దరామయ్యను విచారణకు గవర్నర్ వ్యవస్థను మరోసారి బిజెపి దుర్వినియోగ పర్చింది. అందుకే కర్ణాటక గవర్నర్ బిజెపి పెద్దలు చెప్పినట్లు విచారణకు అనుమతి ఇచ్చారు. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకు అండగా నిలబడాలి. కర్ణాటక కాంగ్రెస్‌లో సిఎం పదవి కోసం నాయకుల మధ్య చీలికలు రాకుండా చూసుకోవాలి. షాడో సిఎంలను ప్రోత్సహించే సంస్కృతిని కాంగ్రెస్ అధిష్టానం మానుకోవాలి. బిజెపి కుట్రలు ఇంతటితో ఆగవు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు బిజెపి కుట్రలు చేస్తున్నది. కాంగ్రెస్ తన పార్టీలో రెండవ, మూడవ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించకుండా అప్రమత్తంగా పార్టీలో, ప్రభుత్వంలో ఐక్యత సాధించాలి.

డా. కోలాహలం
రామ్ కిశోర్
9849328496

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News