Monday, January 20, 2025

నిధుల కోసం ఢిల్లీలో కర్నాటక ధర్నా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ / బెంగళూరు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్నాటకకు కేంద్రం నుంచి నిధులు భారీగా నిలిచిపోయ్యాయనే విమర్శలు ఇప్పుడు తీవ్రస్థాయి రాజకీయ వివాదానికి దారితీశాయి. కర్నాకటకు ఈసారి బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు లేవని, రావల్సిన బకాయిలు రాలేదని పేర్కొంటూ కర్నాటక కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో ఈ నెల 7వ తేదీన( బుధవారం) ధర్నాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ బెంగళూరులో ప్రకటించారు.

కర్నాటక కాంగ్రెస్ విభాగం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు అంతా కలిసి ఒక్కరోజు ధర్నా దేశ రాజధానిలో చేపడుతామని వివరించారు. పన్నుల వాటాలో దేశంలోనే కర్నాటక రెండో స్థానంలో ఉంది. అయితే తమ రాష్ట్రం ప్రతిసారి నిధుల విషయానికి వచ్చేసరికి అడుక్కోవల్సి వస్తోందని శివకుమార్ తెలిపారు. తమ న్యాయమైన నిధుల వాటాకు బెంగళూరు నుంచి దేశ రాజధానికి తమ నిరసన ఉద్యమం విస్తరించక తప్పడం లేదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News