Sunday, December 22, 2024

గుండెపోటుతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్టాణక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. ధ్రువ నారాయణ గుండెపోటుతో శనివారం కన్నుమూశారు. మైసూరులో తన ఇంటిలో ఉదయం 6.40 నిమిషాలకు గుండె నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు డిఆర్‌ఎంఎస్ ఆస్పత్రి డాక్టర్ మంజునాధ్ చెప్పారు. కారులో తరలిస్తున్న సమయంలోనే ధ్రువ నారాయణ రక్తం కక్కుకున్నట్టు తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో బ్లీడింగ్ జరిగింది.

మాజీ ఎంపి ధ్రువనారాయణ అకస్మాత్తుగా చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంతాపం ట్విటర్ ద్వారా తెలిపారు. పార్టీ కోసం క్షేత్రస్థాయి నుంచి కష్టించే నేతగా రాహుల్ కొనియాడారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి ఎదిగారని, సామాజిక న్యాయం కోసం పాటుపడేవారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News