- Advertisement -
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ద్రువనారాయణ కన్నుమూశారు. గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. శనివారం ఉదయం 6.40 గంటలకు ఛాతీలో నొప్పి రావడంతో నారాయణ డ్రైవర్‌కు ఫోన్ చేశారు. కారులో తరలిస్తుండగా ద్రువ నారాయణ రక్తం కక్కారు. ఆస్పత్రిలో తరలించే లోపే చనిపోయాడని వైద్యులు పేర్కొన్నారు. 1983లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అగ్రికల్చర్ కాలేజీలో స్టూడెంట్ లీడర్‌గా, కర్నాటక యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పని చేశారు. గతంలో ఆయన రెండు సార్లు లోక్‌సభ ఎంపిగా సేవలందించారు. కర్నాటకలోని చామరాజనగర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- Advertisement -