- Advertisement -
రియాద్: సంతోష్ ట్రోఫీ ఛాంపియన్‌గా కర్ణాటక నిలిచింది. 54ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మేఘాలయతో జరిగిన కర్ణాటక తేడాతో గెలిచి కప్‌ను సొంతం చేసుకుని 76వ జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. కర్ణాటక తరఫున సునీల్‌కుమార్, బెకి ఓరమ్, రాబిన్ యాదవ్ తలో గోల్ చేసి కర్ణాటకను గెలిపించారు. తరఫున బర్లింగ్టన్, షీన్ చెరో గోల్ చేశారు.
కాగా సౌదీ రాజధాని రియాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం కర్ణాటక ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మ్యాచ్ తొలి సగంలోనే కర్ణాటక మూడు గోల్స్ చేసి మేఘాలయపై ఒత్తిడిని పెంచింది. సునీల్‌కుమార్ రెండో నిమిషంలో, బెకి నిమిషంలో, రాబిన్ 44వ నిమిషంలో గోల్స్ సాధించారు. కాగా కర్ణాటక (స్టేట్ ఆఫ్ మైసూర్) తొలిసారి సంతోష్‌ట్రోఫీని గెలుచుకుంది. అనంతరం ఐదు దశాబ్దాల తరువాత సంతోష్‌ట్రోఫీ విజేతగా నిలిచింది.
- Advertisement -