Monday, April 21, 2025

రోడ్డు ప్రమాదంలో నలుగురు హిందూపురం వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఎపి వాసులు మృతి చెందారు. దేవదుర్గ ప్రాంతంలోని అమర్ పూరా క్రాస్ రోడ్డు వద్ద ట్రక్కును బొలెరో వాహనం ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం నుంచి కర్నాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాలో షహర్‌పూర్‌కు గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు హిందూపురం వాసులు నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఆనంద్ ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News