శ్రీశైలంలో కర్ణాటక భక్తుల వీరంగం
టి దుకాణంలో మొదలైన వివాదం
రెచ్చిపోయిన కన్నడ భక్తులు
100 దుకాణాలు, 20 కార్లు,10 బైక్ లు ధ్వంసం
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాంగణంలో బుధవారం అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శ్రీశైలంలోని ఓ సత్రం ఎదుట ఉన్న టీ దుకాణం యజమానికి కన్నడ భక్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగేందుకు వెళ్లిన కన్నడ భక్తుడు టీ దుకాణదారుడితో మంచినీళ్లు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన టీషాపు యజమాని సదరు కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో హుటాహుటిన గాయపడిన వ్యక్తిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలంలో కర్నాటకవాసిపై దాడి చేయడంపై ఆగ్రహంతో కన్నడిలు ఆగ్రహంతో స్థానికంగా ఉన్న షాపులను ధ్వంసం చేసి నిప్పటించారు ఆలయ పరిసిరాల్లో ఉన్న షాపులపై దాడులు చేశారు.
అంతేకాకుండా షాపులు ధ్వంసం, నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా భయానక వాతావరణం అలుముకుంది. ఈక్రమంలో సుమారు 100 తాత్కాలిక దుకాణాలు 20 కార్లు 10 బైక్ లు ధ్వంసం చేయడంతో పాటు 20 ఫుట్ పాత్ షాపులు దగ్ధం చేశారు. అలాగే పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లల్లోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ద్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఇవొ లవన్న, జగద్గురువు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య, శివాచార్య, కర్ణాటక స్వామిజీలతో మాట్లాడి ప్రత్యేక పోలీస్ బృందాలతో పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
Karnataka Devotees hulchul in Srisailam