Sunday, December 22, 2024

900 అక్రమ అబార్షన్లు చేసిన డాక్టర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : గత మూడేళ్లలో 900 మందికి అక్రమంగా అబార్షన్లు చేసిన డాక్టర్‌ను, ల్యాబ్ టెక్నీషియన్‌ను బెంగళూరు పోలీస్‌లు అరెస్ట్ చేశారు. మైసూరు లోని ఒక ఆస్పత్రిలో డాక్టర్ చందన్ బల్లాల్, అతని ల్యాబ్ టెక్నీషియన్ నిసార్ ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేసి అక్రమంగా అబార్షన్లు చేశారని నేరారోపణలు ఉన్నాయి. ఈ ఆస్పత్రి మేనేజర్ మీనా, రిసెప్షనిస్ట్ రిజ్మాఖాన్ ఈ నెల మొదట్లోనే అరెస్ట్ అయ్యారు. డాక్టర్, టెక్నీషియన్ లను గతవారం పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు.

మైసూరు సమీపాన జిల్లా ప్రధాన కేంద్రం మాండ్యాలో గత నెల నిందితులు శివలింగ గౌడ,నయన్‌కుమార్‌లు అబార్షన్ కోసం కారులో గర్భిణిని తీసుకెళ్తుండగా పోలీస్‌లు పట్టుకోవడంతో అబార్షన్ రాకెట్ బయటపడింది. మాండ్యాలో బెల్లం తయారీ యూనిట్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్‌ను నడుపుతున్నట్టు నిందితులు విచారణలో బయటపెట్టారు. దీంతో పోలీస్‌లు దర్యాప్తు చేయగా ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్టు బయటపడింది.ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News