- Advertisement -
బెంగళూరు: దంపతుల మధ్య గొడవ భార్యను భర్త గొంతు నులిమి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురం ప్రాంతం హుళియాళలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తెరేగాం గ్రామంలో తుకారామ్ మడివాళ(41), శాంతకుమారి(38) అనే దంపతులు నివసిస్తున్నారు. పక్కింటి మహిళతో భర్త మాట్లాడుతుండగా భార్య గమనించింది. ఎందుకు మాట్లాడుతున్నావని అడిగింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టాడు. మృతదేహాన్ని టాటాఎస్‌లో తీసుకొని అటవీ ప్రాంతంలో పడివేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -