Thursday, January 23, 2025

కర్ణాటకలో రూ.375.61 కోట్లు సీజ్..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల సంఘం చేసిన విస్తృత సోదాల్లో మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు పట్టుబడ్డాయి. కర్ణాటకలో ఎన్నికలలో ప్రలోభాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల సంఘం అధికారికంగా సీజ్ చేసిన మొత్తమే ఇన్ని కోట్లు ఉంటే.. ఇక అనధికారంగా ఎంత ఖర్చు చేసి ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా రూ.83.93 కోట్లు పట్టుబడితే ఈసారి ఆ మొత్తం నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న (బుధవారం) జరగనుంది. మొత్తం 224 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేసిన అధికారిక గణాంకల ప్రకారం కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం వివరాలు…
నగదు రూ.147.46 కోట్లు
దొరికిన మద్యం విలువ రూ.83.66 కోట్లు
దొరికిన డ్రగ్స్ విలువ రూ.23.67 కోట్లు
దొరికిన వస్తువుల విలువ రూ.96.6 కోట్లు
ఉచితంగా పంపిణీ చేసిన వాటి విలువ రూ.24.21 కోట్లు
పట్టుబడిన మొత్తం రూ.375.61 కోట్లు
ప్రధానంగా కోలార్ జిల్లాలోని బంగారుపేట నియోజకవర్గంలో రూ. 4.04 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బీదర్ జిల్లాలో వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బెళగావి జిల్లా బైల్ హోంగల్‌లో ప్రెషర్ కుక్కర్లు, సవదత్తిలో 1000కు పైగా కుట్టు మిషన్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News