Wednesday, January 22, 2025

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, జెడి(ఎస్): ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

చిత్రదుర్గ: ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కనికరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రధాని మోడీ మంగళవారం ఆరోపించారు. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడుల సమయంలో దేశ భద్రతా బలగాలను కాంగ్రెస్ ప్రశ్నించిందన్నారు. కాంగ్రెస్, జెడి(ఎస్) ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని మోడీ విమర్శించారు. ఆ పార్టీలు కర్ణాటకలో పెట్టుబడులును ఎన్నడూ పెంచలేదని, అదేవిధంగా రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్ర, ఆలోచన విధానాన్ని కర్ణాటక ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు.

ఢిల్లీలోని బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోతే కాంగ్రెస్ టాప్ మోస్ట్ లీడర్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయని మోడీ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ చిత్రదుర్గ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతా బలగాల సామర్థాన్ని కాంగ్రెస్ శంకించిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని ఎలా ప్రొత్సహించిందో మీరు చూశారని, కర్ణాటకను ఉగ్రవాదుల దయాదాక్షిణ్యాలకు కాంగ్రెస్ వదిలేసిందనారు. ఉగ్రవాదుల వెన్నువిరిచి బుజ్జగింపులకు బిజెపి అడ్డుకట్ట వేసిందని ప్రధాని మోడీ తెలిపారు. సంపన్నమైన కర్ణాటక రాష్ట్రం సురక్షితంగా ఉండటం ముఖ్యమన్నారు. ప్రజల నమ్మకాన్ని, వారంటీని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని ప్రధాని మోడీ అన్నారు.

వారంటీలేని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న ఎన్నికల హామీలు అబద్ధాలు తప్ప మరోటి కాదన్నారు. కాంగ్రెస్‌పార్టీకి అధికారాన్ని ఇచ్చేందుకు ప్రజలు అంగీకరించరని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసని అందుకే అబద్ధపు హామీలను ప్రకటిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఉన్న మరో అజెండా దూషించడం, ప్రజలను రెచ్చగొట్టడమని మోడీ ఆరోపించారు. ఒబిసి, లింగాయత్ కమ్యూనిటీని దూషించారని, తనను తొంబై మార్లకిపైగా దూషించి సెంచరీ దిశగా కాంగ్రెస్ నేతలు పయనిస్తున్నారని మోడీ తెలిపారు. చిత్రదుర్గకు చెందిన దివంగత మాజీ సిఎం ఎస్ నిజలింగప్పను కూడా కాంగ్రెస్ వదలలేదన్నారు. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా కర్ణాటకను నిలిపేందుకు బిజెపి మేనిఫెస్టో రోడ్‌మ్యాప్‌గా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎ నారాయణస్వామి, దావణగెరె ఎంపి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News