Monday, December 23, 2024

ఆ రెండు పార్టీల వల్లే కర్ణాటకలో రాజకీయ అస్థిరత: మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

చన్నపట్న: కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు రాజవంశ కాంగ్రెస్, జేడీ(ఎస్)ముఖ్యకారణమని, ఈ రెండు పార్టీలు కర్ణాటకను ఓ ఎటిఎంగా చూశాయని, అస్థిర ప్రభుత్వాలు దోపిడీకి అవకాశం కల్పిస్తాయని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. రామనగర జిల్లా చన్నపట్నలో ఆదివారం బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ జిల్లా జెడి(ఎస్)కు కంచుకోట వంటిది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే జేడీ(ఎస్) అధినేత హెచ్.డి. కుమారస్వామి బీజేపీ అభ్యర్థి సిపి యోగేశ్వరపై గెలుపొందారు. ఆయన తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు.

Also Read: నేను పామునే, కానీ… : మోడీ

కాంగ్రెస్, జెడీ(ఎస్)లపై దాడి చేస్తూ మోడీ సుదీర్ఘకాలం పాటు కర్ణాటక అస్థిర ప్రభుత్వ డ్రామాను చూసిందని, ఎప్పుడూ ఆ పార్టీలు దోపిడీ కోసమే పోరాటం సాగిస్తాయి తప్ప అభివృద్ధి కోసం కాదని ఎద్దేవా చేశారు. 224 స్థానాలున్న అసెంబ్లీలో 15 నుంచి 20 వరకు సీట్లు వస్తే కింగ్‌మేకర్ అవుతామని జేడీ(ఎస్ )బహిరంగంగా ప్రకటించిందని, ఈ స్వార్థ పరమైన చొరవ ఒక కుటుంబానికే ప్రయోజనం చేకూరి, లక్షలాది కుటుంబాలకు నష్టం కలిగిస్తుందని ప్రధాని విమర్శించారు. గత రెండు రోజుల్లో కర్ణాటకలో ఇది మోడీ ఐదో బహిరంగ సభ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News