Monday, December 23, 2024

కర్ణాటక ఎన్నికలు: రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్..

- Advertisement -
- Advertisement -

బెంగళూర్: మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను గత నెల విడుదల చేయగా, ఇప్పుడు గురువారం 42 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్, జెడి(ఎస్) నుంచి పార్టీ ఫిరాయించి వచ్చిన వారికి కూడా ఈ జాబితాలో చోటు కల్పించింది. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను కూడా పోటీకి నిలబెట్టింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన బాబూరావు చిచన్సూర్, ఎన్‌వై గోపాల కృష్ణలకు ఈ జాబితాలో చోటు దక్కింది. బాబూరావు గుర్మిత్కల్ సీటు నుంచి బరిలో దిగుతుండగా, గోపాలకృష్ణ మొల్కల్కూర్ నుంచి పోటీ చేయనున్నారున. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయిన మల్లికార్జున్ ఖర్గే ఓటమికి ఆనాడు బిజెపిలో ఉన్న బాబూరావు గుర్మిత్కల్ ఒక సాధనంగా పనిచేశారు. మాజీ బీజేపీ ఎంఎల్‌సి అయిన బాబూరావు ఐదుసార్లు ఎమ్‌ఎల్‌ఎగా రెండుసార్లు ఎంపీగా పనిచేసినా, అదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

మరో మాజీ బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ ఎన్‌వై గోపాల క్రిష్ణ ఎమ్‌ఎల్‌ఎ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇటీవలనే కాంగ్రెస్‌లో చేరారు. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూర్ నియోజక వర్గం నుంచి ఎస్‌టి రిజర్వుడ్ అభ్యర్థిగా ఇప్పుడు పోటీకి దిగనున్నారు.2018లో బళ్లారి జిల్లా కుడ్లిగి నియోజక వర్గం నుంచి ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ నియోజక వర్గం నుంచి ప్రస్తుత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బి. శ్రీరాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీరాములు వచ్చే ఎన్నికల్లో బళ్లారి రూరల్ నియోజక వర్గం నుంచి పోటీకి దిగాలనుకుంటున్నారు. బహిష్కృత జెడి(ఎస్) ఎమ్‌ఎల్‌ఎ ఎస్.ఆర్..శ్రీనివాస్ తుమకూరు జిల్లా గుబ్బి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్‌ఎల్‌ఎగా పనిచేశారు. అదే నియోజక వర్గం నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో ఇతర ప్రఖ్యాత వ్యక్తులు ఉన్నారు.

బగల్‌కోట్ నియోజక వర్గం నుంచి హెచ్‌వై మెటి , ధార్వాడ్ నుంచి వినయ్ కులకర్ణి, కలఘట్గి నుంచి సంతోష్ ఎస్, లాడ్ హోలాల్‌కెరా నుంచి హెచ్. ఆంజనేయ, తీర్థహళ్లి నుంచి కిమ్మనె రత్నాకర్ తదితర మాజీ మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మెలుకోటె నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్న సర్వోదయ కర్ణాటక పార్టీ కి మద్దతు తెలియజేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గం నుంచి సర్వోదయ కర్ణాటక అభ్యర్థిగా ప్రఖ్యాత మాజీ నేత కెఎస్ పుట్టనయ్య కుమారుడు దర్శనపుట్టనయ్య పోటీ చేస్తారు మాజీ ముఖ్యమంత్రి థరమ్ సింగ్ కుమారుడు మాజీ ఎంఎల్‌సి విజయ్ ధరమ్‌సింగ్, బసవకల్యాణ్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతారు. ఆయన సోదరుడు డాక్టర్ అజయ్ ధరమ్‌సింగ్ జెవర్గి నియోజక వర్గం అభ్యర్థిగా మొదటి జాబితాలో ఉన్నారు.ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News