Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ నా మార్గదర్శి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ్ తరువాత అంతటి మార్గదర్శి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అని కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత కుమార స్వామి అన్నారు. అలాంటి వ్యక్తితో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలు రావడం దురదృష్టకరమని వ్యా ఖ్యానించారు. ఈ ఊహాగానాలను పూర్తిగా కొట్టిపారేస్తున్నట్లు ఆ యన వెల్లడించారు. జెడిఎస్, బిఆర్‌ఎస్‌ల మధ్య మైత్రి కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాయచూర్‌లో జరిగిన పంచరత్న యాత్రలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నారాయణపేట నియోజకవర్గం బిఆర్‌ఎస్ శాసనసభ్యుడు రాజేందర్ రెడ్డి తో కలిసి కుమారస్వామి పాల్గొన్నారు.

ఆయన మాట్లాడుతూ, కర్నాటకలో జెడిఎస్ అధికారంలోకి వస్తే కెసిఆర్ స్పూర్తితో అనేక పథకాలను అమలు చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా కొనసాగుతోందన్నా రు.అలాంటిరాష్ట్రంతో తమ సంబంధం నిరంతరం కొ నసాగుతుందన్నారు. కెసిఆర్‌తో విబేధాలు ఉన్నాయని జరుగుతు న్న ప్రచారమంతా ఉత్తుతిదేనని అన్నారు. ఇలాంటివి ఎలా పుట్టుకొస్తున్నాయో? ఎందుకు వస్తున్నా యో? తనకు అర్ధంకావడం లేదని వ్యాఖ్యానించా రు. కెసిఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తె లంగాణలోన 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందన్నారు.

రానున్నకర్నాటక ఎన్నికల్లో ఈ పథకాలను ప్రధాన అంశాలుగా పెట్టుకుని ముందుకు సాగనున్నామన్నారు. కెసిఆర్ మ ద్దతుతో రాష్ట్రంలో జెడిఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను ఈ సందర్భంగా ఆయన వ్య క్తం చేశారు. కర్నాటక రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్, బిజెపిలు పెద్ద అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెం డు పార్టీలకు రానున్న ఎన్నికల్లో కర్నాటక ప్రజలు తగు రీతిలో బుద్దిచెప్పనున్నారని పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News