Friday, November 22, 2024

కన్నడనాట బిజెపికి షాక్!

- Advertisement -
- Advertisement -

హంగ్ తప్పదంటున్న ఎగ్జిట్‌పోల్స్ కీలకం కానున్న జెడిఎస్
అతిపెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్
బిజెపికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన రెండు సర్వేలు 
బలంగా పనిచేసిన ప్రభుత్వ వ్యతిరేక పవనాలు, పనిచేయని మోడీ ప్రచారం
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, 72శాతం పోలింగ్ నమోదు
శనివారం ఫలితాలు

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రం కర్నాటకలో బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం తరువాత వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్‌లో హంగ్ అసెంబ్లీ దిశగా సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ అధికారం లో ఉన్న బిజెపి కం గుతిని, రెండో స్థానంలో నిలిచేలా ఉంది. కాగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ గా అవతరించనుందని పోల్ సర్వేలతో వెల్లడైంది. ఈ దశలో దాదాపుగా సగటున పాతిక సీట్లు సాధించుకునే దిశలో దేవెగౌడ, కుమారస్వామిల జెడిఎస్ మూడో స్థా నంలో నిలిచి కింగ్ మేకర్ పాత్రను సార్థకం చేసుకోనుందని ప్రస్తుత విశ్లేషణలతో వెల్లడయింది. హంగ్ అసెంబ్లీ సూచనలతో జెడిఎస్ ఇతర పార్టీల నుంచి మద్దతు అందే పార్టీనే ప్రభుత్వ స్థాపనకు రంగం సిద్ధం చేసుకోగల్గుతుంది. ప్రధాని మోడీ అత్యంత ఆర్భాటపు ప్రచార సరళి, అమిత్ షాల తెరవెనుక ఎన్నికల వ్యూహాలు ఇక్కడి అధికార వ్యతిరేకతను, జనంలో బలంగా నాటుకువెళ్లూనుకుపోయిన భావనను తగ్గించగలిగాయి కానీ నిర్మూలించలేకపొయ్యానని ఎగ్జిట్ పోల్ సర్వేలతో వెల్లడైంది.

మొత్తం 224 స్థానాల అసెంబ్లీలో అధికార స్థాపనకు గీటురాయి బలం అయిన మెజార్టీ మార్క్ 113 సీట్లు. ఈ దశలో టై మ్స్ నౌ ఇటిజి, జీ న్యూస్ మాట్రిజ్, ఇండియా టీవీ సిఎన్‌ఎక్స్ సర్వేలతో ఈ మెజార్టీ మార్క్ సాధించుకుని కాం గ్రెస్ ఒంటరి విజయం సాధిస్తుందని స్పష్టం అయింది. అయితే ఇదే క్రమంలో మరో రెండు సంస్థలు బిజెపికి 117 స్థానాలు వచ్చే వీలుందని తేలిందని పేర్కొంటూ బిజెపి గెలుపు ఉంటుందని తెలిపాయి. అయితే మొత్తం మీద జెడిఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుందనేది కీలక అంశం అయింది. ఐదు ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు దక్కించుకునే ఏకైక పార్టీగా నిలుస్తుందని, బిజెపి కన్నా ఈ రేస్‌లో కొద్దిగా ముందుందని వెల్లడించాయి. ప్రత్యేకించి టైమ్స్ నౌ ఇటిజి సర్వేలో కాంగ్రెస్ తప్పనిసరిగా మెజార్టీ మార్క్ సాధిస్తుందని వెల్లడైంది. పార్టీ సొంతంగా 113 స్థానాలు గెల్చుకుంటుందని, ఇక్కడ ఇతర పార్టీలు మద్దతు తీసుకుంటే జెడిఎస్ అవసరం లేకుండానే పార్టీ ప్రభుత్వం రావచ్చునని తెలిపారు.

అయితే జనతాదళ్ ఎస్ నుంచి తమకు మద్దతు దక్కుతుందని పార్టీ ఆశిస్తోంది. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్, జెడిఎస్ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. తాను ఈసారి కింగ్ మేకర్ కాబోమని కింగ్ అవుతామని దేవెగౌడ పదేపదే తెలిపినా, ఓటరు ఈ పార్టీకి ఇంతకు ముందటి కింగ్ మేకరు పాత్రనే దక్కేలా చేశాయని ఎగ్జిట్ పోల్ సర్వేలతో స్పష్టం అవుతోంది.
కర్నాటకలో ఓట్ల లెక్కింపు శనివారం జరుగుతుంది. శనివారమే ఫలితాలు ప్రకటితం అవుతాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి ఈ ఏడాది చివరి వరకూ జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కర్నాటక ఎన్నికల ఫలితం తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి జయాపజయాలను సూచిస్తుందని భావిస్తున్న దశలో శనివారం వెలువడే నిజమైన ఫలితంపై దేశం యావత్తూ ఎదురుచూస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News