- Advertisement -
బెంగళూరు: కర్ణాటక మాజీ డిజిపి ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యాడు. బెంగళూరులోని హెఎస్ఆర్ లేఔట్‌లో ఉంటున్న ఓం ప్రకాశ్(68) రక్తపు మడుగులో కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్నారు. ఆస్తి కోసం తన భర్తను భార్య హత్య చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కుమార్తెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భార్య, భర్తకు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. బిహార్ లోని చంపారన్ కు చెందిన ఓం ప్రకాశ్ 1981 నుంచి ఐపిఎస్ అధికారిగా సేవలందిస్తున్నారు. 2015 మార్చి 1 వరకు కర్నాటక డిజిపిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో పదవి వీరమణ పొందారు.
- Advertisement -