బెంగళూరు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్పులను సభ ముందుకు తీసుకువచ్చింది. 2025-26 సంవత్సరానికి గాను సిఎం సిద్ధరామయ్య శుక్రవారం రూ.4.08 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళ సాధికారికత వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
ముఖ్యంగా సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు సినిమా టికెట్ ధరను రూ.200గా నిర్ణయించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు సిఎం. మల్టీప్లెక్స్‌లతో పాటు అన్ని థియేటర్లలో ఇదే రేటు ఉంటుదని అన్నారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూరులో ఫిల్మ్‌సిటి నిర్మించేందుకు 150 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.