బెంగళూరు: కర్నాటకలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బిఎస్ యడియూరప్ప ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. ”రాబోయే 14 రోజులకు రేపు రాత్రి 9 గంటల నుండి రాష్ట్రంలో కోవిడ్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య అవసరమైన సేవలు అనుమతించబడతాయి. ఉదయం 10 గంటల తరువాత షాపులు మూతపడతాయి. నిర్మాణం, తయారీ, వ్యవసాయ రంగాలు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయి. ప్రజా రవాణా మూసివేయబడాలి,”అని యడియరప్ప మీడియాతో అన్నారు. కరోనావైరస్ రాష్ట్రమంతటా వేగంగా వ్యాపిస్తున్నాయని కర్నాటక మంత్రి ఎంటిబి నాగరాజ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో పడకలకు భారీ డిమాండ్ పెరిగింది. కోవిడ్-19 వేగంతో వ్యాప్తి చెందుతోంది. కేబినెట్ సమావేశంలో సిఎంకు కొన్ని సూచనలు ఇచ్చాము. సాధారణ ప్రజల ప్రాణాలతో పాటు విక్రేతలు, చిన్న వ్యాపారాలను కాపాడటం చాలా ముఖ్యం, ”అని మంత్రి అన్నారు.
14 రోజుల లాక్‌డౌన్ విధించిన కర్నాటక
- Advertisement -
- Advertisement -
- Advertisement -