Wednesday, November 13, 2024

హిజాబ్ నిషేధ సర్క్యులర్ ను ఉపసంహరించుకోనున్న కర్నాటక!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకల పాఠశాలల్లో, కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధిస్తున్న సర్కులర్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్లు సీనియర్ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ‘కర్నాటకను స్వర్గంగా మలుస్తామని మేమ మా మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము. ఒకవేళ శాంతికి విఘాతం కలిగితే, మేము బజరంగ్ దళా లేక మరో సంఘ్‌పరివార్ సంస్థనా అని చూడం’ అని అన్నారు.

చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా సరే, అది ఆర్‌ఎస్‌ఎస్ కావొచ్చు, మరోకటి కావొచ్చు.. తాము చట్టపరంగా చర్య తీసుకుంటామన్నారు. మేము హిజాబ్‌పైన, గోవధ నిషేధంపైన, మతమార్పిపైన బిజెపి తెచ్చిన చట్టాలను సమీక్షిస్తాము.
ఇదిలావుండగా బిజెపి ప్రభుత్వం తెచ్చిన హిజాబ్ సర్కులర్, గోవధ నిషేధ చట్టం, మతమార్పిడి చట్టం ఉపసంహరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ పార్టీలోని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News