- Advertisement -
మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు, శ్లేష్మం, జ్వరంతో బాధపడుతున్న 60ఏళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
పొరుగు రాష్ట్రమైన కేరళలో కోవిడ్-19కు చెందిన సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు వెలుగుచూడటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకూ కేరళకు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒకరు కరోనాతో కన్నుమూశారు. కేరళకు సమీపంలో ఉన్న మంగళూరు, చామరాజనగర్, కొడగు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు హెచ్చరించారు.
- Advertisement -