బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కట్టడి కాకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో కేసుల సంఖ్య ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం వంటి కారణాల వల్ల లాక్డౌన్కు సంబంధించిన కఠిన ఆంక్షలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప బుధవారం సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ జూన్ 7 తర్వాత కూడా కొనసాగించే విషయమై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నుంచి ఈ మేరకు సూచనలు వెలువడడంతో లాక్డౌన్ కొనసాగే అవకాశాలే అధికంగా కనపడుతున్నాయి. కాగా..గురువారం(జూన్ 3) నుంచి ఎగుమతికి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలను అనుమతించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మరికొన్ని రంగాలకు కూడా మినహాయింపులు ఇచ్చే విషయమై తాను మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతున్నానని ఆయన తెలిపారు. లాక్డౌన్పై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తెలియచేస్తానని ఆయన విలేకరులకు తెలిపారు.
Karnataka Govt to Extend Lockdown after June 7?