Thursday, January 9, 2025

పెళ్లి చేసుకొని…. చెట్టుకు ఉరేసుకున్న ప్రేమ జంట

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వివాహం చేసుకున్న గంటల్లోనే ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం గుల్బర్గాలో జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం… యాడ్రామి తాలుకా మాగణగేరా గ్రామంలోగొల్లాళప్ప(26) అనే యువకుడు తన వరసకు చెల్లెలు అయ్యే శశికళ(20)తో ప్రేమలో పడ్డాడు. ఈ జంట గత కొన్ని రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడిపిస్తుండడంతో ఇరు కుటుంబాల పెద్దలు వద్దని హెచ్చరించారు. శశికళకు మరో యువకుడితో పెళ్లి సంబంధాన్ని ఖరారు చేయడంతో పాటు వచ్చే నెల పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి గొల్లాళప్ప గ్రామ శివారులోకి రావాలని శశికళకు కబురు పంపాడు. గ్రామ శివారులోని దేవాయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన వీడియోను తీసి వాట్సాప్‌లో పెట్టుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలో ఇద్దరు చెట్టుకు ఉరేసుకున్నారు. శనివారం ఉదయం ఉరేసుకున్న జంటను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యాడ్రామి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News