Sunday, December 22, 2024

పెళ్లి చేసుకోలేదని కోడలిని చంపిన మేనమామ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తనని పెళ్లి చేసుకోలేదని మేనకోడలను మామ హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం హావేరి జిల్లా హనగల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బైచవళ్లి గ్రామంలో దీప(21) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. తన కూతురును తన తమ్ముడు మాలతేశ బార్కికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లి నిర్ణయం తీసుకుంది. దీప- బార్కి నిశ్చితార్థం చేసి ఏప్రిల్‌లో పెళ్లి చేయాలని అనుకున్నారు. గతంలో మేనమామ ఇంటికి తాగొచ్చి ఆమెతో పలుమార్లు అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిని పెళ్లి చేసుకోనని పలుమార్లు అతడికి తెలిపింది. మేనమామను పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు ఆమె చెప్పటంతో బార్కి ఆగ్రహానికి లోనయ్యాడు. తన మేనకోడలకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె గొంతు నులిమి హత్య చేసి ఇంటికి వచ్చాడు. తన కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు గాలించారు. ఎక్కడ కనిపించకపోవడంతో బార్కిని గట్టిగా నిలదీయడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బార్కిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News