Sunday, December 22, 2024

ఎడియూరప్పను అరెస్టు చేయవద్దు:కర్నాటక హైకోర్టు

- Advertisement -
- Advertisement -

పోక్సో కేసులో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పకు కర్నాటక హైకోర్టు శుక్రవారం అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ కేసుపై జూన్ 17న విచారణ చేపడతామని, అప్పటివరకు ఆయనను అరెస్టు చేయవద్దని సిఐడిని జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్ ఆదేశించారు. ఎడియూరప్పను అరెస్టు చేయవలసిన అవసరం ఏముందని, పారిపోవడానికి ఆయనేమీ అల్లాటప్పా వ్యక్తి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి ఎదుట జూన్ 17న హాజరుకావాలని ఎడిచూరప్పను కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 14న నమోదైన పోక్సో కేసులో ఎడియూరప్పపై బెంగళూరు కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీచేసింది.

బుధవారం తమ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీచేసినప్పటికీ ఎడియూరప్ప హాజరుకాలేదని, ఆయనపై అరెస్టు వారెంట్ జారీచేయాలని సిఐడి ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కోరింది. అయితేదర్యాప్తులో పాల్గొనేందుకు తనకు మరికొంత సమయం కావాలని ఎడియూరప్ప రోరారు. న్యూఢిల్లీలో ఒక గుర్తు తెలియని ప్రదేశానికి ఎడిచూరప్ప వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. తన 17 ఏళ్ల కుమార్తెపై ఎడియూరప్ప లైంగిక దాడి జరిపినట్లు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బెంఘలూరు పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సిఐడికి అప్పగిస్తూ కర్నాటక డిజిపి ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News