Sunday, December 22, 2024

సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:  కర్ణాటకలో ముడా స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కుంభకోణంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్ ను కర్నాటక హైకోర్టు కొట్టేసింది. గవర్నర్ చర్యలు చట్టప్రకారంగానే ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందటం, అందుకు సిఎం తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలాలతో సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్ కుమార్ కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16న ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. ఆ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. కానీ గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలావుండగా సిద్దరామయ్య రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News