Wednesday, January 22, 2025

కర్నాటకలో పెట్రోల్, డీజిల్ పై సరికొత్త వడ్డింపు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: గెజిట్ ప్రకటన ప్రకారం కర్నాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను 29.84 శాతం, 18.44 శాతం మేరకు పెంచింది. కర్నాటకలోని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం లీటరు పెట్రోల్ రూ. 3.00, డీజిల్ రూ. 3.05 మేరకు పెరుగనుంది.

బెంగళూరులో ఇదివరకు పెట్రోల్ రేటు లీటరుకు రూ. 99.84 ఉండగా ఇప్పుడది రూ. 102.84 అయింది. అదేవిధంగా డీజిల్ రూ. 85.93 నుంచి రూ. 88.95కు పెరిగింది. బెంగళూరులో చందన్ అనే బైకర్ దీనిపై స్పందిస్తూ ‘‘డబ్బున్నోళ్లు ఎంతపెట్టయినా పెట్రోల్ కొంటారు, నేను బిపివోలో పనిచేస్తాను. నాకొచ్చే జీతం రూ. 15000. ఈ పెంచిన ధర నా మీద ప్రభావం చూపగలదు’’ అన్నారు.

మరింత ఆదాయం సమకూర్చుకునేందుకే కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం అనేక రంగాలను ప్రభావితం చేయనున్నది. ముఖ్యంగా వస్తు పంపిణీ రంగాన్ని. దీంతో వినియోగదారుల ఖర్చులు మరింత కానున్నాయి.

దేశీయంగా ముడి చమురు(క్రూడాయిల్) ఉత్పత్తి చేస్తుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్ ను టన్నుకు రూ. 5200 నుంచి రూ. 3250 కు తగ్గించిన కొన్ని గంటలకే కర్నాటక ప్రభుత్వం ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ(SAED) కింద ఈ కొత్త పన్నును వేసింది. ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్ ను 2022 జులై 1న మొదలెట్టింది. ప్రతి పక్షానికి ట్యాక్స్ రేటును సమీక్షిస్తుంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News