Wednesday, January 22, 2025

22 వరకు ఐదు రోజుల పాటు ఉచితంగా ప్రసవాలు

- Advertisement -
- Advertisement -

విజయపుర (కర్నాటక) : గురువారం నుంచి వచ్చే సోమవారం (22) వరకు తమ ఆసుపత్రిలో నవజాత శిశువులకు ఉచితంగా ప్రసవాలు నిర్వహించనున్నట్లు కర్నాటక విజయపురలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రకటించింది. అయోధ్యలో సోమవారం జరగనున్న రామ్ మందిర్ ప్రతిష్ఠాపన ఉత్సవం సందర్భంగా తాము ఈ కార్యకమాన్ని తలపెట్టినట్లు ఆసుపత్రి వెల్లడించింది. విజయపురలో జెఎస్‌ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్న ‘శ్రీ సిద్ధేశ్వర్ లోక కల్యాణ చారిటబుల్ ట్రస్ట్’ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘

అయోధ్యలో సోమవారం (22న) జరగనున్న ‘రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ’ సందర్భంగా గురువారం నుంచి మా ఆసుపత్రిలో కొత్త శిశువుల ప్రసవాలను ఉచితంగా నిర్వహించనున్నాం. అది ఒక పెద్ద సందర్భం. గణనీయమైన సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం. అందువల్ల ఐదు రోజుల పాటు మా ఆసుపత్రిలో ప్రసవాలను ఉచితంగా జరపనున్నాం’ అని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు. ‘గురువారం ఇంత వరకు ఏడు ప్రసవాలను ఉచితంగా నిర్వహించాం’ అని ఆయన తెలిపారు. విజయపుర ఎంఎల్‌ఎ బసనగౌడ పాటిల్ ఈ నిర్ణయాన్ని హర్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News