Monday, December 23, 2024

ప్రియురాలి బర్త్ డే వేడుకలలో ఆమె గొంతు కోసి…..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రియురాలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసి అనంతరం ఆమె గొంతు కోసి ప్రియుడు హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్నర్ సెక్యూరిటీ డివిజన్‌లో నవ్య(24) అనే యువతి పని చేస్తుంది. కనకపూర ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌కు నవ్య దూరపు బంధువు కావడంతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. మంగళవారం నవ్య బర్త్ డే కావడంతో ప్రశాంత్ హాజరు కాలేదు. ప్రశాంత్ తీరకలేని పనులు ఉండడంతో హాజరుకాలేదని తన ప్రియురాలుకు నచ్చచెప్పాడు.

Also Read: రేపు నా అరెస్టు ఖాయం: కేజ్రీవాల్

శుక్రవారం రాత్రి బర్త్ వేడుకులు చేసుకుందామని నవ్యను తన దగ్గరికి పిలిచాడు. జన్మదిన వేడుకలలో కేక్ కట్ చేసిన తరువాత ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే కత్తి తీసి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. స్థానికుల సమాచార మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. నిందితుడు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుందని, అందుకే ఆమెను చంపేశానని వివరణ ఇచ్చాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News