Saturday, December 21, 2024

శ్రీసత్యసాయి జిల్లాలో కర్నాటక మద్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. రొద్దం మండలం ఆర్ లోచర్లలో 192 కర్నాటక మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. వైసిసి నేత, సర్పంచ్ గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగాధర్‌తో పాటు భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బైక్‌పై తరలిస్తున్న 288 ప్యాకెట్ల మద్యాన్ని పోలీసులు పట్టుకోవడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నలుగురు నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు తమిళనాడు, ఇటు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News