Thursday, December 26, 2024

కర్ణాటక మద్యం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

గద్వాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యంను బుధవారం రాత్రి గద్వాల అబ్కారీ శాఖ పోలీసులు పట్టుకున్నట్లు ఇన్స్‌పెక్టర్ జీడి గోపాల్ తెలిపారు. బుధవారం రాత్రి కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్‌పోస్టులో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు నిర్వహించారు.

రాయచూరు నుంచి గద్వాలకు వస్తున్న ఆర్టీసి బస్సుల్లో నిర్వహించగా రాయచూరు జిల్లా మండ్లగేరికి చెందిన జమ్మన్న వద్ద కర్ణాటక మద్యం 4 బీర్‌బాటిల్స్, 7విస్కి టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు గద్వాల ఎక్సైజ్ సీఐ గోపాల్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News