Wednesday, December 25, 2024

కిడ్నాప్… ముక్కలు ముక్కలుగా నరికి… అడవి జంతువులకు వేశారు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు, డబ్బులు ఇచ్చిన తరువాత సదరు వ్యక్తి చంపేసి ముక్కలు, ముక్కలుగా నరికి అటవీ జంతువులకు పడేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మల్లేశ్వరం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురుసిద్ధప్ప అనే వ్యక్తిని సంజయ్, ఆనంద్‌లు కిడ్నాప్ చేశారు. సిద్ధప్ప భార్యకు ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తే భర్తను వదిలేస్తామని డిమాండ్ చేశారు. ఆమె ఐదు లక్షల రూపాయలతో మంచినబెలె అడవి ప్రాంతంలోకి వెళ్లడంతో నిందితులు డబ్బులు తీసుకున్నారు. ఆమె భర్తను వదిలేస్తామని భార్యను నమ్మించారు. సిద్ధప్పను వదిలిస్తే తమ బండారం బయటపడుతుందని, అడవిలోకి తీసుకెళ్లి అతడికి మద్యం తాగించారు. అనంతరం అతడిని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికారు. నిందితులు గోవాకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అడవిలో దొరికిన శరీర భాగాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News