Saturday, December 21, 2024

మార్కుల తక్కువ వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు… ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇంటర్ ఫలితాలలో తక్కువ మార్కులు వచ్చాయని అడిగినందుకు తల్లిని కుమార్తె కత్తితో పొడిచింది. అనంతరం అదే కత్తి లాక్కొని కుమార్తెను తల్లి పొడవడంతో ఆమె మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రంలోని మల్లేశ్వరం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బనశంకరి ప్రాంతంలో పద్మజ(40) తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. ఇంటర్ ఫలితాలలో కుమార్తె సాహితికి(19) 40 మార్కులు తక్కువ రావడంతో ఆమెను తల్లి పలుమార్లు ప్రశ్నించింది. కోపంతో రగిలిపోయిన కూతురు కత్తి తీసుకొని తల్లిని పొడించింది. అదే కత్తి తీసుకొని తల్లి కుమార్తెను పొడవడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన తల్లిని ఆస్పత్రికి తరలించారు. పద్మజ పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News