Thursday, January 23, 2025

చస్తానని బెదిరించి ప్రేయసికే స్పాట్ పెట్టాడు…..

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటానని స్కూటర్ ఎక్కి తాడుకు ఉరేసుకుంటుండగా ప్రియురాలు ఆ తాడు తీసుకొని మెడకు వేసుకోగానే ప్రియుడు ఆ స్కూటర్‌ను తన్నడంతో ఉరి బిగించుకోని ఆమె చనిపోయిన సంఘటన కర్నాటక బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఎంజి నగర్‌లో అద్దె ఇంట్లో సర్గునమ్మ- శివకుమార్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ అనే వ్యక్తి ఇంట యజమాని దగ్గరకు వస్తుండడంతో ఇద్దరు మధ్య పరిచయం ఏర్పడడంతో సర్గునమ్మతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

Also Read: డేటాను దొంగిలించే మాల్వేర్‌ను బ్లాక్ చేసిన గూగుల్!

వివాహేతర సంబంధం బయటకు తెలియడంతో భార్యను పలుమార్లు శివకుమార్ హెచ్చరించాడు. గణేష్ ఆటో కొనుక్కొని నడుపుతానంటే రూ.50000 నగదు కూడా ఇచ్చింది. గణేష్‌కు మరో మహిళతో సంబంధం ఉందని ప్రియురాలు అనుమానం వ్యక్తం చేసింది. పోతలమ్మ గుడి సమీపంలో ఓ ఇంట్లో నుంచి ప్రియుడు వస్తుండగా ప్రియురాలి గమనించి అడిగింది. ప్రియురాలితో వేగలేనని చెప్పి తాడి బిగించి హోండా డియో స్కూటీ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడు బెదిరించాడు. దీంతో సర్గునమ్మ బైక్ ఎక్కి తన మెడకు తాడు తగిలించుకుంది. అదే సమయంలో గణేష్ బైక్‌ను తన్నడంతో ఆమె మెడకు ఉరి చుట్టుకోవడంతో మృతి చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్మించాడు. కానీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News