Monday, January 20, 2025

టీచర్ ను హత్య చేసి పూడ్చి పెట్టారు…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయురాలిని దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చి పెట్టిన సంఘటన కర్నాటక రాష్ట్రం మండ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మేటుకోటె ఎస్‌ఇటి పబ్లిక్ స్కూల్‌లో ఒప్పంద పద్ధతిలో దీపిక అనే మహిళ టీచర్‌గా పని చేస్తుంది. మాణిక్యనహళ్లిలో తన భర్త లోకేష్‌తో కలిసి జీవనం సాగిస్తుంది. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. గత శనివారం స్కూల్ నుంచి దీపిక ఇంటికి రాకపోవడంతో మేటుకొటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీపకను హత్య చేసి అనంతరం యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చి పెట్టారు. గుంతలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News