Thursday, January 16, 2025

కాపీ కొడుతూ దొరకడంతో భవనం పైనుంచి దూకిన బిటెక్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పరీక్ష హాలులో కాపీకొడుతూ దొరకడంతో బిటెక్ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మంగళూరులోని హోశాకరెహళ్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆదిత్య ప్రభు అనే విద్యార్థి పిఇసి యూనివర్సిటీలోని బిటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆధిత్య తండ్రి గణేష్ ప్రభు ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళూరులోని బన్నెరుగట్టలో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రభు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడు. ఎగ్జామ్ హాలులో ఉన్నప్పుడు అతడి వద్ద సెల్‌ఫోన్‌ను ఇన్విజిలేటర్ గుర్తించాడు. సెల్‌ఫోన్‌లో చూసి అతడు కాపీ కొడుతున్నట్టుగా గుర్తించారు. వెంటనే ఆఫీస్ రూమ్‌కు తీసుకెళ్లి అతడి తల్లిదండ్రులకు కాలేజీ సిబ్బంది ఫోన్ చేశారు. వెంటనే ప్రభు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి భవనంలోని ఎనిమిదో ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించినప్పటికి అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. ఆదిత్య తండ్రి గణేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అతడు కాపీ కొట్టడంతో పరువు పోయిందనే అనుమానంతోనే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు: ఖర్గే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News