Wednesday, April 2, 2025

మూడు నాగు పాములతో కర్నాటక వ్యక్తి చెలగాటం!

- Advertisement -
- Advertisement -

 

Snaker Sayyed

బెంగళూరు: మూడు నాగు పాములతో కర్నాటక వ్యక్తి ‘స్టంట్’… సిర్సీకి చెందిన పాములుపట్టే మాజ్ సయ్యద్(20) ఒక దాని తోక పట్టుకుని ఆడిస్తుండగా మరొకటి అదను చూసి అతడిని కాటేసింది. దీన్నంతా  వీడియో తీయడం ‘భయానకం’ అని చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. పాములతో ఫీట్లు చేసే అతడి వీడియోలు చాలా ‘యూట్యూబ్’లో ఉన్నాయి. కానీ ఇప్పుడు అతడిని ఓ పాము కాటేసిన వీడియో మాత్రం చాలా వైరల్ అయింది. అతడిని కాటేసిన పాము అలాగే కరిచి పట్టుకుందే తప్ప ఓ పట్టాన వదిలిపెట్టలేదు. ‘ఇది నాగుపాములతో చెలగాటమే…మనిషి కదలికలను నాగుపాము ముప్పుగా భావిస్తుంది. ఒక్కోసారి దాని ప్రతిచర్య ప్రాణం మీదికి వస్తుంది’ అని అటవీశాఖ అధికారి సుశాంత నంద విమర్శించారు. కాగా ‘స్నేక్‌బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ’ వ్యవస్థాపకుడు ప్రియాంక కదం ప్రస్తుతం సయ్యద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. నాగుపాములన్నీ విషపూరితాలని అందరికీ తెలుసు. ఇదిలావుండగా సయ్యద్‌కు ఇప్పటి వరకు 46 సీసాల(వయల్స్) యాంటీ వీనమ్(విషం విరుగుడు మందు) ఇచ్చారని సమాచారం.

Sayyed in Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News