Monday, December 23, 2024

రూ. కోటి సుపారీతో తండ్రిని చంపించిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కోటి రూపాయలు సుపారీతో కుమారుడు తన తండ్రిని హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మరాతాహల్లి బ్లాక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నారాయణ స్వామి అనే వ్యక్తి తన భార్య, కుమారుడు, కోడలితో కలిసి జీనం సాగిస్తున్నాడు. నారాయణ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాడు. నారాయణ స్వామికి మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. 2013లో మణికంఠ తన మొదటి భార్యను చంపేశాడు. దీంతో కొన్ని రోజులు జైలు జీవితం గడిపి బయటకు వచ్చాడు. 2020లో అర్చన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో ఆమెను కత్తితో పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదే సమయంలో నారాయణ అర్చనకు ఓ ప్లాట్ రాసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అర్చనకు ప్లాట్ రాసి ఇవ్వడం మణికంఠకు ఇష్టం లేదు. దీంతో నారాయణ స్వామిని చంపాలని నిర్ణయ తీసుకున్నాడు. జైళ్లో ఉన్నప్పుడు ఆధర్శ్, శివ పరిచయమయ్యారు. తన తండ్రిని చంపితే శివ, ఆదర్శ్‌కు కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. నారాయణ స్వామి బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు తల్వార్‌తో దాడి చేశారు. దీంతో నారాయణ స్వామి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శివ, ఆదర్శ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తన తండ్రి మర్డర్ వెనుక మణికంఠ ఉన్నాడని తెలియగానే అతడిని కూడా అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News