Monday, December 23, 2024

రుణమాఫీ కోసం కరువు కోరే బాపతు:కర్నాటక మంత్రి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు :రైతులు కరువు కాటకాలు రావాలని కోరుకుంటారని , ఈ పరిస్థితి ఏర్పడితే తమ రుణాలు మాఫీ అవుతాయని ఆశిస్తారని కర్నాటక మంత్రి శివానంద పాటిల్ వ్యాఖ్యానించారు. బెలగావి జిల్లాలోని చిక్కోడిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన పాటిల్ రైతులు ఎప్పుడూ దేభ్యపు బాపతే అని , వానలు పడక కరువు వస్తే రుణమాఫీ ఉంటుందని కలలు కంటుంటారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో పాటిల్ చెరకు అభివృద్ధి, జవుళి మంత్రిగా ఉన్నారు.

రైతులు తమకు అన్ని ఉచితం కావాలనుకుంటారని, వీరికి కృష్ణా నది నుంచి నీరు వస్తుంది. పంటలకు ఉచిత కరెంటు అందుతోంది. పలువురు సిఎంలు వారికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేశారు. రుణాలు దండిగా పొందారు. ఇప్పుడు వీరు తమ రుణాల మాఫీకి చివరికి కరువు రావాలని కోరుకునే దాకా వెళ్లుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై దుమారం చెలరేగింది. ప్రతిపక్ష బిజెపి, జనతాదళ్ (ఎస్) మంత్రి తీరును దుయ్యబట్టారు. వెంటనే ఆయన రైతులకు క్షమాపణ చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News