Sunday, December 22, 2024

మహిళను చెంపదెబ్బ కొట్టిన కర్నాటక మంత్రి

- Advertisement -
- Advertisement -

Karnataka minister Somanna slaps woman

బెంగళూరు: కర్నాటకలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మంత్రి ఒకరు ఓ మహిళను చెంపదెబ్బ కొట్టిన ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గుండ్లుపేట తాలూకా హంగాల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వి. సోమన్న శనివారం హంగల గ్రామంలో మహిళా లబ్ధిదారులకు భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు నంజప్ప సూచించిన మేరకే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగిందని మెంపమ్మ అనే మహిళ వేదిక వద్దకు వచ్చి ఆరోపించింది. తనకు ప్రభుత్వ లబ్ధి అందలేదన్న ఫిర్యాదుపై మంత్రితో మాట్లాడేందుకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఆమె మంత్రి పాదాలను తాకడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News