Sunday, January 19, 2025

క్రైస్తవులపై విద్వేష ప్రసంగం: కర్నాటక మంత్రిపై కేసు

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: క్రైస్తవులపై విద్వేషపూరిత ప్రసంతం చేశారన్న ఆరోపణపై కర్నాటక మంత్రి మునిరత్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేసిన పిర్యాదుపై పోలీసులు మంత్రి మునిరత్నపై కేసు నమోదు చేశారు. మార్చి 31న ఒక న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో హార్టికల్చర్ శాఖ మంత్రి అయిన మునిరత్న మాట్లాడుతూ ఈ క్షణంలో కూడా క్రైన్తవులు మతమార్పిడులకు పాల్పడుతున్నారని, అత్యధికంగా మురికివాడలలో ఇవి జరుగుతున్నాయని అన్నారు.

1400 మంది నివసించే ప్రదేశాలలో 400 మందిని మతం మారుస్తున్నారని ఆయన చెప్పారు. మతమార్పిడుల కోసం వారు వస్తే తన్నితరిమేయండి..లేదా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అంటూ ఆయన చెప్పారు. బెంగళూరులో ఆర్‌ఆర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మునిరత్నపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News