Wednesday, January 8, 2025

తల్లిని గొంతు నులిమి చంపి… కుమారుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కన్నతల్లి గొంతునులిమి చంపి అనంతరం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు శివారులో జరిగింది. ఓల్డ్ చంద్రపూర్ ప్రాంతంలో రమేశ్ అనే వ్యక్తి(21) తన తల్లి లక్ష్మీ దేవితో కలిసి ఉంటున్నాడు. రమేశ్ క్లీనర్‌గా పని చేశాడు. అతడు మద్యానికి బానిస కావడంతో ఇద్దరు మద్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఫుల్ మద్యం తాగి ఇంటికి రావడంతో కుమారుడిని తల్లి మందలించింది. దీంతో ఇద్దరు మద్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిని కుమారుడు గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు విజయనగర జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News