Monday, January 20, 2025

భార్య ఆ పని చేసిందని భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం పావగడ తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోడరహళ్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్, గుమ్మఘట్టకు చెందిన షర్మిలను పెళ్లి చేసుకన్నారు. దంపతులకు కుమారుడు(1) ఉన్నాడు. పలుమార్లు భర్తకు చెప్పకుండానే తన పుట్టింటికి వెళ్లిపోవడంతో అత్తింటివారు మందలించారు. భర్త మందలించిన కూడా భార్యలో మార్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని సోమందేపల్లిలో క్యాతగాన చెర్లు గ్రామానికి భార్య వెళ్లిపోయిందని తెలుసుకొని ఆ గ్రామానికి భర్త వెళ్లాడు. భార్య గురించి విచారించగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తెలిసింది. వెంటనే ఇంటికి వెళ్లి భార్య చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి రామాంజినప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News