హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడి
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం మతమార్పిడి వ్యతిరేక బిల్లును తీసుకురావలని యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మంగళవారం తెలిపారు. కొన్ని ఇతర రాష్ట్రాలు తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక బిల్లుల అంశాలు అధ్యయనం చేయనున్నామని కూడా ఆయన తెలిపారు.
కర్నాటకలో మతమార్పిడి విరివిగా జరుతోందని, ఎంఎల్‌ఎ
గూలి హట్టి శేఖర్ తెలుపడమేకాక, తన తల్లి క్రైస్తవ మతంలోకి మతంమార్చబడిందని పేర్కొన్న తర్వాత దానిని నియంత్రించడానికి బిజెపి ప్రభుత్వం మతమార్పిడి వ్యతిరేక బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు.
తన తల్లిని బ్రెయిన్‌వాష్ చేసి మతమార్పిడికి గురిచేశారని హోసదుర్గ శాసనసభ్యుడు గూలిహట్టి శేఖర్ తెలిపారు.
“క్రైస్తవ మిషనరీలు హోసదుర్గ నియోజకవర్గంలో మతమార్పిడిలు చేస్తున్నారు. వారు హిందూమతం నుంచి దాదాపు 18000 నుంచి 20000 మందిని తమ మతంలోకి మార్చారు. నా తల్లిని కూడా క్రైస్తవ మిషనరీలు మతం మార్చారు. ఆమెను తన ఫలభాగంపై కుంకుమ పెట్టుకోకూడదన్నారు” అని శేఖర్ తెలిపారు.
కర్నాటకలో మతమార్పిడులు పెరిగిపోవడంపై మాజీ స్పీకర్ కెజి బొప్పయ్య, నాగ్‌థన్ ఎంఎల్‌ఎ దేవానంద్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటక శాసనసభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తడంతో బసవరాజ్ బొమై నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని పరిశీలించి, ఇతర రాష్ట్రాల మాదిరిగానే మతమార్పిడి వ్యతిరేకబిల్లును తీసుకురావాలని స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి కోరారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు మతమార్పిడి వ్యతిరేక బిల్లులను ఆమోదించాయి. వివాహాలు వంటి సంబంధాలతో సహా మతమార్పిడిని నిరోధించేలా అవి చట్టాలని చేశాయి.
ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సైతం ఈ నెల మొదట్లో బలవంతంగా మతమార్పిడీలు చేయడం, లవ్‌జిహాద్ కార్యకలాపాలకు పాలడడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.