దావణగెరే: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మేలో జరుగనున్నాయని, కర్నాటకలో బిజెపి ప్రభుత్వం తిరిగి రాగలదన్న ఆశాభావాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికే ఓటేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నాటకను కాంగ్రెస్ నాయకులు తమ ఏటిఎంగా చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘ఎవరికీ మెజారిటీ రాకపోతే కర్నాటక బ్యాడ్ షేప్‌లోకి వెళ్లిపోతుంది, కాదా? మీరు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా, లేదా? పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కావాలనుకుంటున్నారా, లేదా?’ అని ఆయన అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్ సంకల్ప యాత్ర’ చేపడుతుందన్నారు. ‘బిజెపి గెలిస్తే, కర్నాటకలో బలమైన ప్రభుత్వం నెలకొంటుంది’ అన్నారు. కాంగ్రెస్ ఉత్తుతి వాగ్దానాలనే చేస్తుందని, నెరవేర్చదని అన్నారు. కర్నాటకలో ప్రజలు ‘మోడీ మీ కమలం వికసిస్తుంది’ అంటున్నారని తెలిపారు.
#WATCH | Prime Minister Narendra Modi, Karnataka CM Basavaraj Bommai greets people gathered for BJP's Vijay Sankalp Yatra in Davanagere, Karnataka. pic.twitter.com/voeWnLyJ0F
— ANI (@ANI) March 25, 2023