Monday, December 23, 2024

కింగ్ మేకర్ కాదు… కింగ్‌లం: జెడిఎస్

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: సింగపూర్ కేంద్రంగా కర్నాటక పొలిటికల్ గేమ్ నడుస్తోంది. జెడిఎస్ అధినాయకత్వం మాత్రం తాము కింగ్ మేకర్ కాదని తామే కింగ్ అని అంటుంది. మాజీ సిఎం సదానంద గౌడ మాత్రం మాజీ ప్రధాని, జెడిఎస్ అగ్రనేత దేవెగౌడతో టచ్‌లో ఉన్నామని చెబుతున్నారు. జెడిఎస్‌ను చీల్చేందుకు డికె శివ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ ప్రముఖులు ఆరోపణలు చేస్తున్నారు. ఎనిమిది మంది జెడిఎస్ అభ్యర్థులతో డికె బేరాలు ఆడినట్టు సమాచారం. గత ఎన్నికలలో జెడిఎస్ తక్కువ సీట్లు వచ్చినప్పటికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్, జెడిఎస్ ఎంఎల్‌ఎలను బిజెపోళ్లు లాక్కోవడంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్నాటక శాసన సభలో మొత్తం 224 స్థానాలకు 113 సీట్ల మెజార్టీ ఉంటే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ సారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News