Monday, December 23, 2024

కర్నాటక ఎన్నికలు: 5102 నామినేషన్లు దాఖలు!

- Advertisement -
- Advertisement -
ఏప్రిల్ 21న పరిశీలన

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. కాగా దాఖలు చివరి తేదీ గురువారం వరకు 3600 మంది అభ్యర్థుల నుంచి 5102 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఎన్నికల ప్రకటన విడుదలయ్యాక ఏప్రిల్ 13 నుంచే మొదలయింది.

దాఖలైన మొత్తం 4710 నామినేషన్లలో 3327 పురుష అభ్యర్థులు 4710 నామినేషన్లు దాఖలు చేయగా, 304 మహిళలు 391 నామినేషన్లు దాఖలు చేశారు. ఒక నామినేషన్ మాత్రం ‘థర్డ్ జెండర్’కు చెందిన వ్యక్తి దాఖలు చేశారు. ఈ వివరాలను కర్నాటక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గురువారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

707 నామినేషన్లను బిజెపి అభ్యర్థులు వేయగా, 651 నామినేషన్లను కాంగ్రెస్ అభ్యర్థులు, 455 నామినేషన్లను జెడి(ఎస్), మిగతావి స్వతంత్రులు, చిన్నాచితక పార్టీల అభ్యర్థులు దాఖలు చేశారు. అధికారుల ప్రకారం ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఆరో రోజైన గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరు రోజు. కాగా చివరి రోజున అనేక మంది ప్రముఖులు సహా 1691 మంది అభ్యర్థులు 1934 నామినేషన్లు దాఖలు చేశారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నామినేషన్ల గడువుకు ముందు కాంగ్రెస్ ఎంపీ డి.కె. సురేశ్ కనకపుర సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగారు. అక్కడ ఆయన అన్న కాంగ్రెస్ చీఫ్ డి.కె. శివకుమార్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల ప్రకారం ‘బ్యాకప్ ప్లాన్’లో భాగంగానే సురేశ్ ఈ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఒకవేళ శివకుమార్ నామినేషన్ ఏ కారణం చేతనైనా తిరస్కరించబడితే తమ్ముడి నామినేషన్ ఉపయోగపడగలదని యోచన. జెడి(ఎస్) అభ్యర్థి హెచ్.పి. స్వరూప్, హసన్ నుంచి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. జెడి(ఎస్) చీఫ్ దేవె గౌడ, ఆయన యావత్ కుటుంబం స్వరూప్‌కు అండగా పనిచేస్తోంది. బిజెపి అభ్యర్థి చన్నబాసప్ప శివమొగ్గ నుంచి తన నామినేషన్లు దాఖలు చేశారు. అక్కడి సిట్టింగ్ ఎంఎల్‌ఏ కె.ఎస్.ఈశ్వరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బిజెపి అభ్యర్థి అశోక్ జయరామ్ మాండ్య నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఆయన వెంట స్వతంత్ర ఎంపీ సుమలత అంభరీశ్, మంత్రి సి.ఎన్.అశ్వథ్ నారాయణ్ ఉన్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జర్కిహోలి తన నామినేషన్‌ను బెల్గావి జిల్లాలోని యెమకన్‌మర్డి నుంచి దాఖలు చేశారు. మంత్రి శశికళ జొల్లే అదే జిల్లాలోని నిప్పని నుంచి నామినేషన్లు వేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమె వెంట వచ్చారు. నామినేషన్లు దాఖలు చేసిన ఇతరులలో బిజెపి ఎంపీ రేణుకాచార్య(హోన్నలి), కట్టా జగదీశ్(హెబ్బల్), రామచంద్ర గౌడ(సిద్లాఘట్ట), కాంగ్రెస్‌కు చెందిన రామనాథ్ రాయ్(బంత్వల్), యోగేశ్ హెచ్.సి.(శివమొగ్గ) నుంచి తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న జరుగనున్నది. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 24.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News