Sunday, March 23, 2025

కర్ణాటకలో ఏప్రిల్ 1 నుంచి పెరుగనున్న విద్యుత్తు ఛార్జీలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటకలోని విద్యత్తు వినియోగదారులు ఏప్రిల్ 1 నుంచి అదనంగా యూనిట్‌కు 36 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్ణాటక విద్యుత్తు నియంత్రణ కమిషన్(కెఈఆర్‌సి) విద్యుత్తు సరఫరా కంపెనీలు(ఎస్కామ్‌లు)వినియోగదారుల నుంచి పింఛను, గ్రాట్యుటీ తాలూకు ప్రభుత్వ వాటాలను తిరిగి పొందేందుకు అనుమతించడంతో ఈ చర్య అమలులోకి వచ్చింది. పింఛను, గ్రాట్యుటీ కంట్రీబ్యుషన్లను ఆర్థిక సంవత్సరం 202627, 202728లో సవరించనున్నారు. పింఛను, గ్రాట్యుటీ సర్‌ఛార్జీ కింద ప్రభుత్వ వాటాను వసూలు చేయనున్నట్లు కర్ణాటక విద్యుత్తు నియంత్రణ కమిషన్ తెలిపింది. ‘ఇది ప్రజా వ్యతిరేక విధానం’ అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర విమర్శించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదగ్గరి నుంచి ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. కాంగ్రెస్ అమలు చేసిన ఒకే ఒక గ్యారంటీ ‘ధరలు పెంచడం’ అని వ్యంగ్యంగా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News